నేడు పార్లమెంటులో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ సంస్కరణలకు మరింత ఊతమిచ్చేలా ఉంది. ప్రత్యేకించి సంస్కరణలను అమలు చేసే రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సహకాలు అందిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. ప్రధానంగా 50 ఏళ్ల వరకు వడ్డీ రహిత రుణాలు (మూల ధన వ్యయం కోసం) కల్పించనున్నట్లు సీతారమన్ తెలిపారు. ప్రత్యేకించి విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సహకాలివ్వనున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. ఇప్పటికే ఎపి ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో స్మార్ట్ మీటర్లతో ప్రజల మరిన్ని భారాలు మోపి వారి నడ్డి విరుస్తోంది. మొత్తంగా వికసిత్ భారత్ 2047 లక్ష్యమని చెబుతూ.. సంస్కరణలను వేగవంతం చేసేందుకే కేంద్రం యత్నిస్తోందని ఈ బడ్జెట్ తెలియజేస్తోంది.