7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక

Jun 11,2024 00:01 #By election, #election commision
  • షెడ్యూల్‌ విడుదల చేసిన ఇసి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో వివి ధ కారణాలతో ఖాళీ అయిన 13 అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఇసిఐ) షెడ్యూల్‌ విడుదల చేసింది. పశ్చిమబెంగాల్‌ నుంచి 4, హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి 3, ఉత్తరాఖండ్‌ నుంచి 2, బీహార్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌లలో ఒక్కో స్థానం షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఇసిఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఎన్నికలకు జూన్‌ 14న నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్లు తెలిపింది. జూన్‌ 21న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం, జూన్‌ 24 నామినేషన్ల పరిశీలనకు గడువు ఉంటుందని తెలిపింది. జూన్‌ 26 నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీగా వెల్లడించింది. జులై 10న 13 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. జులై 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

➡️