బీహార్‌లో నిరసనకారులపై విరుచుకుపడ్డ పోలీసులు
పాట్నా : ప్రిలిమినరీ పరీక్షలో మార్పులు చేయవద్దని, పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసిన సివిల్ సర్వీసెస్ అభ్యర్థులపై బీహార్ పోలీసులు లాఠీఛార్జి చేశారు. రాష్ట్ర రాజధాని పాట్నా బెయిలీ రోడ్‌లోని బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బిపిఎస్‌సి) ఎదుట అభ్యర్థులు శుక్రవారం నిరసన చేపట్టారు. 70వ కంబైన్డ్ ప్రిలిమినరీ పరీక్షను నార్మలైజ్ చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగానే పరీక్షా విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి, నిరసనకు దిగిన సివిల్ సర్వీస్ అభ్యర్థులను చెదరగొట్టారు.
ప్రిలిమినరీ నార్మలైజేషన్ కోసం ఎలాంటి ప్రణాళిక లేదు : బిపిఎస్‌పి
ప్రిలిమినరీ నార్మలైజేషన్ కోసం ఎటువంటి ప్రణాళిక ప్రకటించలేదని బిపిఎస్‌సి కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఆందోళన వీడి ప్రిపరేషన్‌పై దృష్టిసారించాలని సూచించారు.