న్యూఢిల్లీ : యుజిసి-నెట్ ప్రశ్నాపత్రం స్క్రీన్ షాట్‌ను టెలిగ్రామ్‌లో వైరల్ చేసిన యువకునిపై సిబిఐ గురువారం చార్జిషీట్ నమోదు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. దర్యాప్తు, యువకునిపై చార్జిషీట్‌కి సంబంధించిన వివరాలను అనధికారికంగా సిబిఐ ప్రభుత్వానికి వెల్లడించినట్లు ఆ అధికారి తెలిపారు.
ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున కుట్రను గుర్తించలేదని, చార్జిషీటు మోసం, మోసానికి పాల్పడటం నేరాలకు పరిమితమవుతుందని సిబిఐ వెల్లడించినట్లు తెలిపారు. జూన్ 18 పరీక్షకి సంబంధించిన లీకైన స్క్రీన్ షాట్ నకిలీదని, ఓ విద్యార్థి పోస్ట్ చేసినట్లు సిబిఐ దర్యాప్తులో గుర్తించింది. ఓ యాప్ ద్వారా ఉద్దేశ్యపూర్వకంగా పాఠశాల విద్యార్థి పేపర్ స్క్రీన్‌షాట్‌ను సృష్టించినట్లు సిబిఐ పేర్కొంది. పేపర్‌కు యాక్సెస్ ఉందన్న అభిప్రాయం కలిగించి డబ్బు సంపాదించేందుకు స్క్రీన్‌షాట్‌లో తేదీని జూన్ 17గా మార్చినట్లు సిబిఐ తెలిపింది.
యుజిసి -నెట్ పరీక్షలు తిరిగి ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 4 వరకు జరగనున్నాయి.