రారుపూర్ : ఛత్తీస్‌గఢ్ మాజీ సిఎం భూపేష్ బాఘేల్‌కి వరుస కేసులు చుట్టుముడుతున్నాయి. ఇటీవల మద్యం కుంభకోణానికి సంబంధించి ఇడి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించింది. తాజాగా మహదేవ్ బెట్టింగ్ యాప్ ముడుపుల కేసులో సిబిఐ అధికారులు బుధవారం ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
మహదేవ్ బెట్టిగ్ యాప్ ప్రమోటర్ల నుంచి భూపేష్ బాఘేల్ రూ. 508 కోట్ల ముడుపులు అందాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిబిఐ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. ఆ యాప్ యజమాని శుభమ్ సోని.. బఘేల్‌కు తనకు సంబంధాలు ఉన్నాయని, వందలాది కోట్ల రూపాయలను బఘేల్‌కు ముడుపులుగా ఇచ్చినట్టు అంగీకరించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇడి ఇప్పటికే విచారణ చేపట్టింది.
మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై భూపేశ్ బాఘేల్, ఆయన కుమారుడు చైతన్య బఘేల్ నివాసంలో ఇడి అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే.
