‘గగన్‌యాన్’లో CE20 క్రయోజెనిక్ ఇంజిన్ సిద్ధం.. ఇస్రో ట్వీట్

Feb 21,2024 16:46

బెంగళూరు: మనం దేశం చేపడుతున్న మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’పై ఇస్రో శాస్త్రవేత్తలు ఫోకస్ పెట్టారు. ఈ మేరకు గగన్‌యాన్‌ మిషన్‌ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గగన్‌‌యాన్ మిషన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇస్రో ఇచ్చింది. గగన్‌యాన్ మిషన్‌ను లాంఛ్ చేసేందుకు CE20 క్రయోజెనిక్ ఇంజిన్ సిద్ధమైనట్లుగా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. . క్రయోజెనిక్‌ ఇంజిన్‌ తుది పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించింది. నింగిలోకి వ్యోమగాములను పంపేందుకు వినియోగించే ఎల్‌వీఎం3 లాంచ్‌ వెహికల్‌లో దీనిని వాడనున్నారు. ఒకవేళ మిషన్ విజయవంతం అయితే ఈ ఫీట్ సాధించిన అమెరికా, చైనా, రష్యా లిస్ట్‌లో మనదేశం కూడా చేరుతుంది.

➡️