Budget : ఎంఎస్‌పిని విస్మరించిన కేంద్రం

Feb 1,2025 13:39 #Budget, #MSP

బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధరకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. రైతులు గత కొన్నేళ్లుగా మద్దతు ధర కోసం పోరాడుతూనే ఉన్నారు. ఎంఎస్‌పికి చట్టబద్ధహామీ కల్పిస్తామని మోడీ 2.0 ప్రభుత్వం హామీనిచ్చింది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం మరోసారి రైతుల డిమాండ్‌ను విస్మరించింది. కేవలం వంద జిల్లాల్లోని 1.7 కోట్ల రైతులకు ప్రయోజనం చేకూరేలా ధన్‌ ధాన్య కృషి యోజన పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు నిర్మలమ్మ బడ్జెట్‌ సందర్భంగా చెప్పారు.

➡️