దుబాయ్ ఇంటర్‌నేషనల్ స్టేడియంవేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ పోరుకు సర్వం సిద్ధమైంది. ఇండియా – న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌పై దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కల్‌కతా లో జోరుగా గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తతంగా తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు బుకీలను అరెస్ట్ చేశారు. అనంతరం వారి నుంచి రూ.22 లక్షల లిక్విడ్ క్యాష్‌ను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
