మార్చిలో ప్రార్థనా స్థలాల చట్టం కేసు విచారణ : చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా

న్యూఢిల్లీ : 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై వచ్చే నెల మార్చిలో విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సోమవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉంది. అయితే ఫిబ్రవరి 17న విచారణ జరగనుంది. అయితే ఈరోజు జరగాల్సిన విచారణ మార్చికి వాయిదా పడింది. ఈ బెంచ్‌లో మూడవ న్యాయమూర్తిగా ఉన్న కె.వి విశ్వనాథన్‌ అందుబాటులో లేరు. ఈయన సుప్రీంకోర్టు మరో బెంచ్‌కి నేతృత్వం వహించాల్సి రావడంతో.. ఆయన అందుబాటులో లేనందున ఈ కేసు విచారణ మార్చికి వాయిదా పడింది. పిటిషర్లలో ఒకరైన సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ ఈ కేసు విచారణపై జస్టిస్‌ సంజరు ఖన్నా, సంజరు కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అయినప్పటికీ చీఫ్‌ జస్టిస్‌ ఈ కేసులో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ చేపట్టడం సాధ్యం కాకపోవచ్చని చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా తెలిపారు.

➡️