చండీగఢ్ : పంజాబ్‌లో ఆప్, శిరోమణి అకాలీ దళ్ (ఎస్‌ఎడి) నేతల మధ్య జరిగిన వాగ్వివాదం కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో ఆప్ నేత మందీప్ సింగ్ బ్రార్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లాలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. ఓ పాఠశాలకు సంబంధించిన ఫైల్‌ను క్లియర్ చేయాల్సిందిగా ఎస్‌ఎడి నేత వీర్‌దేవ్ సింగ్ తన అనుచరులతో కలిసి స్థానిక బ్లాక్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయత్ అఫీసర్ (బిడిపిఒ) కార్యాలయానికి వెళ్లారు. బిడిపిఒ సిబ్బంది నిరాకరించడంతో ఆగ్రహంతో బయటికి వెళ్లిపోయారు. కార్యాలయం ఎదుట ఆప్ నేత మందీప్ సింగ్ బ్రార్‌తో వాగ్వివాదానికి దిగారు. వెంటనే వీర్‌దేవ్ సింగ్ ఆప్ నేతపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
