న్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రాంగణంలో 2 కాఫీ స్టాళ్ల ఏర్పాటుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించడానికి ఆయన అవకాశం కల్పించారు. సంగం 1, 2 కోర్టు యార్డ్ వద్ద స్టాళ్ల ఏర్పాటుకు స్పీకర్ అనుమతించారు. ఆయన ఆదేశాలతో రెండు స్టాళ్లను ఏర్పాటు చేసుకోవాలని లోక్‌సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై గిరిజన కోఆపరేటివ్ సొసైటీ అధికారులు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. నేటి సాయంత్రం ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి దేశ రాజధానికి వెళ్లనున్నారు. సోమవారం నుంచి మార్చి 28 వరకు వీటి ఏర్పాటుకు అవకాశం కల్పించారు.
