ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్న చలి

Jan 9,2025 12:01 #agra, #AQI, #Delhi

న్యూఢిల్లీ :  ఉత్తరాది రాష్ట్రాలను చలి వణికిస్తోంది. మరోసారి ఢిల్లీలో గాలి నాణ్యతలు (ఎక్యూఐ) పడిపోయాయి. గురువారం ఉదయం 7 గంటలకు ఢిల్లీలో 299 వద్ద ఎక్యూఐ నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఆదివారం నుంచి వరుసగా ఢిల్లీలో వాయునాణ్యతలు పడిపోతున్నాయి. దీంతో ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. రహదారులు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఈరోజు ఉదయం 5.30 గంటలకు కనిష్ట 6.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.
కాగా, ఉత్తరాది రాష్ట్రాలను చలి వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఈరోజు దట్టమైన మంచు కురిసింది. 7.30 గంటలకు లక్నోలో 7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రయాగ్‌రాజ్‌లో 7.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండి తెలిపింది. హర్యానా, అంబాలాలో జనవరి 14 వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
జమ్మూకాశ్మీర్‌లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. గురువారం 8.30 గంటలకు -3.2, గుల్మార్గ్‌ -4.6, పహల్గామ్‌లో -10.3, బనిహల్‌ 4.8, కుప్వారాలో -3.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

➡️