రాజ్‌కోట్ :ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 1 వద్ద శుక్రవారం ఉదయం పైకప్పు కూలిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను మరిచిపోకముందే గుజరాత్‌లోని రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. భారీ వర్షం కారణంగా రాజ్‌కోట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ వెలువల ఉన్న పైకప్పు శనివారం కుప్ప కూలిపోయింది. ప్రయాణికుల పికప్, డ్రాప్ పాయింట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
