- పార్టీ కేంద్ర కార్యాలయం సందర్శన
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సిపిఎం కేంద్ర కార్యాలయాన్ని క్యూబా రాయబారి సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీకి అభినందనలు తెలిపారు. మంగళవారం నాడిక్కడ కేంద్ర కార్యాలయం (ఎకెజి భవన్)ను క్యూబా రాయబారి జువాన్ కార్లోస్, రాయబార కార్యాలయ ప్రతినిధి అబెల్ డెస్పైగే సందర్శించారు. ఈ సందర్భంగా ఇటీవల మదురైలో జరిగిన సిపిఎం 24వ అఖిల భారత మహాసభలో క్యూబా సంఘీభావ తీర్మానం ఆమోదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ తీర్మానం అమలుకు సిపిఎం అన్ని విధాలా కృషి చేస్తుందని బేబీ పేర్కొన్నారు. ఆగస్టు 13 నుంచి ఫైడల్ కాస్ట్రో శతజయంత్యుత్సవాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్ అరుణ్ కుమార్ పాల్గొన్నారు.