MP: ఎంఎస్‌పిని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఆందోళనలు

Mar 10,2025 19:03 #bhopal, #congress party protests

భోపాల్‌ : రైతుల సమస్యలపై నేడు కాంగ్రెస్‌ కార్యకర్తలు భోపాల్‌లో ఆందోళనలు చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు అసెంబ్లీని ఘెరావు చేయడానికి వెళుతుండగా.. కార్యకర్తల గుంపును పోలీసులు చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. వారిపై జలఫిరంగులను ప్రయోగించారు. ఈ ఆందోళనల్లో మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జిటు పట్వారీ, ప్రతిపక్షనేత ఉమాంగ్‌ సింఘార్‌, ఎమ్మెల్యే సచిన్‌ యాదవ్‌తోపాటు పలువురు పార్టీ కార్యకర్తలు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్వారీ మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర మహిళలు, రైతులు, యువతకు బిజెపి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు నిర్వహిస్తోంది. బియ్యానికి క్వింటాకు రూ. 3,100, గోధుమలు క్వింటాకు రూ. 2,700లు బిజెపి ప్రభుత్వం ఇస్తుంది. క్వింటాకు రూ.6000 వేలు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) అందించాలని మేము డిమాండ్‌ చేస్తున్నాము. కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి ఈ రాష్ట్రానికి చెందినవాడే అయినప్పటికీ.. ఆయన ఎంఎస్‌పి గురించి మాట్లాడరు’ అని ఆయన కామెంట్‌ చేశారు. బియ్యం, గోధుమల సేకరణ జరగకపోతే ప్రతి మండికి చేరుకుని రైతులతో నిరసనలు చేపడతాం అని ఆయన అన్నారు.

➡️