Haryana : కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

హర్యానా : హర్యానా కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పది మున్సిపల్‌ కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పదింటిలో తొమ్మిది స్థానాల్లో బిజెపి గెలిచింది. ఒక స్థానంలో బిజెపి రెబల్‌ స్వతంత్ర అభ్యర్థి ఇందర్‌జిత్‌ యాదవ్‌ గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. మాజీ సిఎం భూపిందర్‌ సింగ్‌ హుడా తాలుకా అయిన గురుగ్రామ్‌, రోహతక్‌లలో కూడా కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురైంది.

కాగా, ఈ ఎన్నికలు మార్చి 2వ తేదీన జరిగాయి. పది మున్సిపల్ స్థానాల్లో 8 బై పోలింగ్ సీట్లు. మేయర్, అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మునిసిపల్ ఎన్నికలలో 650 వార్డులకు కూడా ఎన్నికలు జరిగాయి

➡️