న్యూఢిల్లీ : భారత్ గత కొన్ని సంవత్సరాలుగా అత్యంత ప్రమాదకరమైన, కష్టతరమైన ఆర్థిక పరిస్థితిలో ఉందని కాంగ్రెస్ పేర్కొంది. వేతనాల్లో అనిశ్చితి, ద్రవ్యోల్బణం మరియు ఆర్థిక అసమానతలు దేశంలో వినియోగ వృద్ధిని దెబ్బతీస్తున్నాయని తెలిపింది. ఈ చెక్‌పాయింట్లను సీరియస్‌గా తీసుకోకుంటే రాబోయే సంవత్సరాలలో వృద్ధిని అడ్డుకుంటాయని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ప్రతినిధి జైరాం రమేష్ పేర్కొన్నారు.
గత మూడు దశాబ్దాలుగా భారతదేశ వినియోగ వృద్ధిలో పెరుగుదల ఉందని, కోట్లాది కుటుంబాలు పేదరికాన్ని అధిగమించి మధ్యతరగతిలోకి ప్రవేశించారని అన్నారు. దీంతో కొత్తగా ఉత్పత్తులను కొనుగోలు చేయగలరు, ఆస్తులను పొందగలరు అని అన్నారు. ఇది ఆర్థిక వృద్ధికి నిదర్శనమని, వేగంగా అభివృద్ధి చెందుతూ, దాని లాభాలను విస్తృతంగా పంపిణీ చేస్తుందని చెప్పారు.
అయితే గత పదేళ్లలో, భారతదేశ వినియోగ కథ ఇప్పుడు తిరోగమనంలో ఉందని, భారత ఆర్థికవ్యవస్థకు అతిపెద్ద అడ్డంకులుగా మారాయని అన్నారు. భారతదేశంలో మధ్యతరగతి కుచించుకుపోతుందని అన్నారు. ఆర్థిక వృద్ధి క్షీణించడానికి వేతనాల్లో స్తబ్థత, అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానతలని పేర్కొన్నారు. ఇటీవల విడుదల చేసిన పరిశ్రమల వార్షిక అధ్యయనం (ఎఎస్‌ఐ) 2022-2023 ప్రభుత్వ అధికారిక గణాంకాలతో పాటు పలు సర్వేలు పేర్కొంటున్నాయని అన్నారు. కార్మికులు పది సంవత్సరాల క్రితం కంటే ఈ రోజు తక్కువ కొనుగోలు చేయగలుగుతున్నారని స్పష్టమైన ఆధారాలు చూపుతున్నాయని అన్నారు.
ఈ వేతనాల్లో స్తబ్థత భారత్‌లోని కార్మికుల ఉత్పాదకత క్షీణతకు కారణం కావచ్చు. కార్మిక ఉత్పాదకత పడిపోవడం, నిజమైన వేతనాలు స్తబ్థుగా ఉండటంతో కుటుంబాల వినియోగానికి అతి తక్కువ ఆదాయన్ని వెచ్చిస్తారని అన్నారు.
2015లో ఓ సాధారణ వ్యక్తి రూ.100ను కొనుగోళ్లకు వెచ్చిస్తే.. దానిలో 18 శాతం పరిశ్రమల యజమానికి చెల్లించేవాడు. కానీ నేడు. అదే యజమానికి లాభాలలో రూ.36 చెల్లిస్తున్నాడని అన్నారు. వస్తువుల మరియు సేవల ధరల్లో తీవ్రమైన పెరుగుదల కొనుగోళ్లను పెంచే సామాన్యుని సామర్థ్యాన్ని, ప్రత్యేకించి స్తబ్థుగా ఉన్న వేతనాలను తగ్గించిందని అన్నారు.
ఆర్థిక వృద్ధికి ప్రధాన సూచిక అయిన గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల అమ్మకాలు 2018తో పోలిస్తే తక్కువగానే ఉన్నాయని అన్నారు.