చండీగఢ్ :హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా కొనసాగుతోంది. ప్రారంభంలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగినప్పటికీ.. తర్వాత బిజెపి పుంజుకుంటోంది. రెండు పార్టీలు పోటాపోటీగా ఉన్నాయి. ప్రస్తుతం బిజెపి 46 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ 37 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డి) 2 స్థానాల్లో ముందంజలో ఉంది. మరో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఆప్ ఇప్పటికీ ఖాతా తెరవలేదు.
హర్యానా ఎన్నికల కౌంటింగ్‌పై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా స్పందించారు. వాస్తవంగా లెక్కించిన రౌండ్లు, ఎన్నికల కమిషన్ ద్వారా టెలివిజన్‌లో చూపిన రౌండ్లలో తేడా ఉందని అన్నారు. ప్రస్తుతం 11 రౌండ్లు లెక్కింపు పూర్తికాగా, ఇసి ఇప్పటికీ 4, 5 రౌండ్ల లెక్కింపులను చూపుతోందని అన్నారు. బిజెపి ఒత్తిడి పెంచుతోందా అని కాంగ్రెస్ ప్రతినిధి జైరాం రమేష్ ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ పాత పొకడలను ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.