Karnataka court : సిద్ధరామయ్యపై విచారణ కొనసాగించండి..

  • కర్ణాటక కోర్టు ఉత్తర్వులు

బెంగళూరు : ముడా కుంభకోణం కేసులో కర్ణాటకలో ప్రత్యేక కోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణను కొనసాగించాలని ఆదేశించింది. లోకాయుక్త పోలీసులు పూర్తి దర్యాప్తు చేపట్టాలని, అప్పటివరకు ఎటువంటి ఆదేశాలు ఉండవని కోర్టు పేర్కొంది. లోకాయుక్త నివేదిక సముచితమని భావిస్తే.. ఆ నివేదికపై అభ్యంతర పిటిషన్‌ దాఖలు చేయవచ్చని ఇడిని అనుమతించింది. ఈ కేసుపై విచారణను మే 7కి వాయిదా వేసింది.

➡️