బెంగళూరు: ముస్లింల ఓటు హక్కును తొలగించాలంటూ విశ్వ వొక్కలిగ మహాసంస్థాన మఠంకు చెందిన చంద్రశేఖర్ స్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మంగళవారం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో వక్ఫ్ బోర్డు వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకుందని ఆరోపిస్తూ,దానికి వ్యతిరేకంగా సంఘ్ పరివార్ అనుబంధ సంస్థ భారతీయ కిసాన్ సంఘ్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోసమే రాజకీయ నాయకులు ఇలాంటి పనులు చేస్తుంటారని పేర్కొన్నారు. మన దేశానికి మంచి పేరు రావాలంటే ముస్లింల ఓటు హక్కును తొలగించే చట్టం తీసుకురావాలన్నారు. అప్పుడు వారు వారి స్థానంలో ఉంటారని, మిగిలిన వారు శాంతియుతంగా జీవించవచ్చని పేర్కొనడంతో ఆయన వ్యాక్యాలు వివాదాస్పదంగా మారాయి.
