న్యూఢిల్లీ : వక్ఫ్ సవరణ చట్టం దేశంలోని ముస్లిం మైనారిటీ హక్కులపై దాడి అని సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు, కుల్గాం ఎమ్మెల్యే ముహమ్మద్ యూసుఫ్ తరిగామి పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో వక్ఫ్ బిల్లుపై చర్చకు అనుమతించని స్పీకర్ చర్యను తరిగామి ఖండించారు. ‘అన్ని మతాలకు వాటి స్వంత సంస్థలు ఉన్నాయి. అయితే, వక్ఫ్ చట్టంలో చేసిన సవరణలు ఒకే ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. రాజ్యాంగం అన్ని మతాలకు వారి స్వంత సంస్థలను నిర్వహించే హక్కును ఇస్తుంది. రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్యంపై ఈ చట్టం ప్రత్యక్ష దాడి చేస్తుందని’ ఆయన శ్రీనగర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు.