కోటాలో కొనసాగుతున్న విద్యార్థుల మరణాలు.. జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య

Feb 13,2024 11:54 #kota student, #Rajasthan, #suside

కోటా : రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల మరణాలు కొనసాగుతున్నాయి. 12వ తరగతి చదువుతూనే జేఈఈకి శిక్షణ తీసుకుంటున్న విద్యార్థి   తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ప్రతిరోజూ ఉదయాన్నే ఇంటికి ఫోన్‌ చేసే కుమారుడి నుంచి ఫోన్‌ కాల్‌ రాకపోవడంతో అనుమానించి వార్డెన్‌కు ఫోన్‌ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వార్డెన్‌ వెళ్లి చూస్తే విద్యార్థి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందికి దింపి పోస్టుమార్టానికి తరలించారు.ఈ ఏడాది ఇది నాలుగో కేసు కాగా, గతేడాది 29 మంది ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం ఉండడం లేదు.

➡️