Delhi : ఢిల్లీలో నిన్నటి కంటే.. ఈరోజు మెరుగుపడిన గాలి నాణ్యతలు

Nov 28,2024 12:10 #AQI, #Delhi

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని వాయుకాలుష్యం కమ్మేస్తోంది. అయితే నిన్నటి కంటే ఈరోజు గాలి నాణ్యతలు మెరుగుపడ్డాయి. కానీ గాలి నాణ్యతలు స్థాయి ‘వెరీ పూర్‌’ కేటగిరీలోనే నమోదయ్యాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. గురువారం ఢిల్లీలో గాలి నాణ్యతలు 304 వద్ద నమోదయ్యాయి. దీంతో ఢిల్లీ వాసులు కళ్లమంటలు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు.
కాగా, ఢిల్లీలో మరికొన్ని ప్రాంతాల్లో ఎక్యూఐ స్థాయిలు ఇలా ఉన్నాయి. పూసా 281, లోధి రోడ్డు 250, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 301, ఐటివో 284 వద్ద ఎక్యూఐ నమోదైందని సిపిసిబి పేర్కొంది.
ద్వారకా, 332, జహంగీర్‌ పురి 354, సోనియా విహార్‌ 315, వజీర్పూర్‌ 330, అశోక్‌ విహార్‌ 318, బవానా 341 స్థాయిలో గాలి నాణ్యతలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో తీవ్రమైన స్థాయిలో గాలినాణ్యతలు నమోదయ్యాయని సిపిసిబి వెల్లడించింది.

➡️