Delhi Assembly elections: ఫిబ్రవరి 5న పోలింగ్‌

న్యూఢిల్లీ :   ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను మంగళవారం మధ్యాహ్నం ఎన్నికల సంఘం (ఇసి) ప్రకటించింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. ఫిబ్రవరి 5న పోలింగ్‌  నిర్వహించనున్నట్లు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సిఇసి) రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు. జనవరి 10న నోటిఫికేషన్‌ ప్రకటించనున్నారు. నామినేషన్ల చివరి తేది జనవరి 17, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జనవరి 20.   ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడించనున్నట్లు సిఇసి తెలిపారు.

ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ఫిబ్రవరి 23తో ముగియనుంది.

➡️