న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ గురువారం నిప్పులు చెరిగారు. దేశ రాజధానిలో శాంతి భద్రతలు దిగజారాయని, 1990లో ముంబయి తరహాలో ఢిల్లీ తయారైందని అన్నారు. ఆ సమయంలో ముంబయిలో మాఫియా ప్రభావం అధికంగా ఉండేదని, టివిషోలు, సినిమాల్లో అందరం చూశామని అన్నారు. ఢిల్లీలోని ప్రశాంత్‌విహార్‌లో పేలుడు వార్త అనంతరం అతిశీ పై విధంగా స్పందించారు.
ఢిల్లీలో హోం మంత్రి అమిత్‌షా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే.. స్థానికుల భద్రతపై దృష్టి సారించాలని ఎద్దేవా చేశారు. మంత్రుల నివాసాలకు సమీపంలో దోపిడీ సంబంధిత వార్తలు వస్తున్నాయని అన్నారు. శాంతి భద్రతలపై బిజెపి, అమిత్‌షాదే ప్రధాన బాధ్యత అని, కానీ నేడు హోంమంత్రి నివాసానికి 5-10 కి.మీ దూరంలో దోపిడీ, తుపాకీ కాల్పుల ఘటనలు జరుగుతున్నాయని అన్నారు.