న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపి శశథరూర్‌పై దాఖలైన పరువునష్టం కేసును ఢిల్లీ కోర్టు మంగళవారం కొట్టివేసింది. ఫిర్యాదులో ప్రాథమికంగా పరువునష్టం కలిగించే అంశాలు లేవని, శశిథరూర్‌కు సమన్లు జారీ చేయలేమని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ పరాస్ దలాల్ పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో తాను ఓటర్లకు లంచాలు ఇచ్చానని శశిథరూర్ జాతీయ మీడియాలో తప్పుడు, అవమానకరమైన ప్రకటనలు చేయడం ద్వారా తనకు పరువునష్టం కలిగించారని బిజెపి నేత రాజీవ్ చంద్రశేఖర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో కోర్టు ఫిర్యాదును విచారణకు స్వీకరించింది.
