న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి మెజార్టీ ఆధిక్యమిచ్చిన ఓటర్లకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘జనశక్తి ప్రధానమైనది. అభివృద్ధి గెలుస్తుంది. సుపరిపాలన విజయం సాధిస్తుంది. ‘ఏబిజెపి4ఇండియాకు చారిత్రాత్మక ఆదేశమిచ్చిన ఢిల్లీలోని నా ప్రియమైన సోదర సోదరీమణులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ ఆశిర్వాదాల్ని మేము వినమ్రంగా, గౌరవంగా స్వీకరిస్తాము. ఢిల్లీని అభివృద్ధి చేయడంలో, ప్రజల మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరచడంలో, వికసిత్ భారత్‌ను నిర్మించడంలో ఢిల్లీ ప్రధాన పాత్ర పోషించేలా చేయడంలో మేము ఎటువంటి రాయిని వదిలిపెట్టబోమని హామీనిస్తున్నాము’ అని మోడీ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బిజెపి గెలుపు కారణమైన ఆ పార్టీ కార్యకర్తలను చూసి తాను గర్వపడుతున్నాని మోడీ పేర్కొన్నారు.
Delhi election results 2025 : వికసిత్ భారత్ నిర్మాణంలో ఢిల్లీ కీలక పాత్ర పోషిస్తుంది : మోడీ
