assault case : బిభవ్‌ కుమార్‌ బెయిల్‌ను తిరస్కరణ

న్యూఢిల్లీ :  ఆప్‌ రాజ్యసభ ఎంపి స్వాతి మలివాల్‌ దాడి కేసులో బిభవ్‌ కుమార్‌కి బెయిల్‌ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. అతనికి బెయిల్‌ ఇచ్చేందుకు ఎలాంటి కారణం లేదని జస్టిస్‌ అనూప్‌ కుమార్‌ మెండిరట్ట బిభవ్‌ కుమార్‌ బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చారు.

తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, దర్యాప్తు పూర్తయినందున తన కస్టడీని పొడిగింపు అవసరం లేదని పేర్కొంటూ బెయిల్‌ జారీ చేయాల్సిందిగా బిభవ్‌ కుమార్‌ పిటిషన్‌లో తెలిపారు.

మే13న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నివాసంలో బిభవ్‌ కుమార్‌ స్వాతిమలివాల్‌పై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. స్వాతి మలివాల్‌ ఫిర్యాదు మేరకు మే 18న పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం అతను జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

➡️