న్యూఢిల్లీ : పాన్‌మసాలా ప్యాకేజీలపై 50 శాతం హెచ్చరిక లేబుల్ అవసరాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. పాన్ మసాలాలపై 3 మి.మీ ఉండే ఫాంట్ సైజ్‌ను పెంచాలని ఈ ఏడాది మేలో భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ (ఫసీ) నిబంధనలు జారీ చేసిన సంగతి తెలిసిందే. నియంత్రణ అత్యంత ప్రధానమైన ప్రజా ప్రయోజనాలను కాపాడే చట్టపరమైన ఉద్దేశ్యాన్ని ప్రభావితం చేస్తుందని ఢిల్లీ హైకోర్టు వాదించింది.
ఈ నిబంధనలను సవాలు చేస్తూ రజనీగంధ, తాన్‌సేన్, మస్తాబా వంట ప్రసిద్ధ పాన్ బ్రాండ్‌ల తయారీ దారులు ధర్మపాల్ సత్యపాల్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. చట్టబద్ధమైన హెచ్చరిక పరిమాణం గణనీయంగా పెరగడానికి శాస్త్రీయ ఆధారం లేదని కంపెనీ పేర్కొంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఎఫ్‌ఎస్‌ఎస్) యాక్ట్ ప్రకారం నియమించిన సైంటిఫిక్ కమిటీ లేదా సైంటిఫిక్ ప్యానెల్ ఎటువంటి అధ్యయనం చేపట్టలేదని వాదించింది.