ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి మరో షాక్ తగిలింది. తాజాగా ఇదే కేసులో మరో మంత్రి కైలాష్ గెహ్లాట్‌కు సైతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. ఆయనకు ఈడీ సమన్లు జారీ చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఆయన ఢిల్లీ ప్రభుత్వంలో హౌం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా ఆప్ ఎంపీ సంజరు సింగ్, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత కూడా తీహార్ జైలులో ఉన్నారు.
