Delhi Liquor Scam: మనీష్‌ సిసోడియా కస్టడీ పొడిగింపు

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్‌ స్కాం మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎ మనీష్‌ సిసోడియా జ్యుడిషియల్‌ కస్టడినీ ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఈ నెల 30 వరకు కస్టడీ పొడగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయముర్తి కావేరి బవేజా ఈ ఆదేశాలు ఇచ్చారు. ఇడి గతేడాది మార్చి 9న మనీష్‌ సిసోడియాను అరెస్ట్‌ చేసింది. సిసోడియా తరుపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ సిసోడియాకు బెయిల్‌ మంజారు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ఇడి, సిబిఐలు వరసగా వ్యక్తులను అరెస్టు మాత్రమే చేస్తున్నాయని, విచారణను త్వరగా ముగించే ప్రశ్నే లేదని తన వాదన వినిపించారు. ఇడి తరుపు న్యాయవాదులు సిసోడియాకు బెయిల్‌ మంజారు చేయవద్దని కోర్టుకు విన్నవించారు.

➡️