Delhi minister: ఆప్‌ సీనియర్ నేత కైలాష్ గెహ్లాట్‌ రాజీనామా

న్యూఢిల్లీ :   ఆప్‌ మంత్రి, సీనియర్‌ నేత కైలాష్‌ గెహ్లాట్‌ ఆదివారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కైలాష్‌ గెహ్లాట్‌ ప్రస్తుతం ఆప్‌ ప్రభుత్వంలో హోం, రవాణా, ఐటి, మహిళలు, శిశుసంక్షేమ శాఖలతో పాటు కీలకమైన మంత్రిత్వ శాఖల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. బిజెపిలో చేరే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్టీ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌కు తన రాజీనామా లేఖను పంపారు. ఆప్‌ పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని, హామీలను నెరవేర్చడంలో విఫలమైందని లేఖలో ఆరోపించారు.

➡️