Delhi Police : రూ.3.3 కోట్ల విలువైన కొకైన్‌ స్వాధీనం

Oct 11,2024 16:36 #Delhi Police, #Drug case, #Police seize

న్యూఢిల్లీ : రూ.3.3 కోట్ల విలువైన 563 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు శుక్రవారం తెలిపారు. డ్రగ్‌ సిండికేట్‌ను చేధించినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.   ఇద్దరు నైజీరియన్‌లతో పాటు మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. అరెస్టయిన ఇద్దరు నైజీరియన్ల నుండి 563 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పక్కా సమాచారం మేరకు నైజీరియాకు చెందిన జాషువాతో పాటు డ్రైవర్‌, సహచరుడు వినీత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు.

➡️