Delhi poll : పిజి వరకు ఉచిత విద్య బిజెపి హామీ

Jan 21,2025 13:10 #BJP manifesto, #Delhi polls

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 5వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని కైవశం చేసుకునే ఉద్దేశంతో ఆప్‌, బిజెపి పోటాపోటీగా హామీల వర్షం కురిపిస్తున్నాయి. నేడు బిజెపి ‘సంకల్ప్‌ పాత్ర’ పేరుతో రెండో మ్యానిఫెస్టోని విడుదల చేసింది. అధికారంలోకి వస్తే.. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థినీ విద్యార్థులందరికీ కెజి టు పిజి వరకు ఉచిత విద్యను అందిస్తున్నట్లు బిజెపి హామీ ఇచ్చింది. ఈ సందర్బంగా బిజెపి ఎంపి అనురాగ్‌ ఠాకూర్‌ విద్యార్థులకు పోటీ పరీక్షలకు సన్నద్ధమవ్వడానికి 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. రెండుసార్లు ప్రయాణ ఖర్చులకు, అప్లికేషన్‌ ఫీజులను రీయింబర్స్‌ చేయనున్నట్లు అనురాగ్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు.
కాగా, గతవారం ఫిబ్రవరి 5న మొదటి మ్యానిఫెస్టోని విడుదల చేసింది. ప్రతినెలా మహిళకు రూ. 2,500, గర్భిణీ మహిళలకు రూ. 21,000, ఎల్‌పిజి గ్యాస్‌ సిలిండర్‌ రూ. 500లకు, సీనియర్‌ సిటిజన్స్‌కు ప్రతినెలా రూ. 2,500 పెన్షన్‌ అందివ్వనున్నట్లు హామీ ఇచ్చింది.

➡️