న్యూఢిల్లీ : దేశ రాజధానిలో గాలి నాణ్యతలు తీవ్రస్థాయిలో పడిపోయాయి. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఢిల్లీలో 301 స్థాయిలో గాలి నాణ్యతలు నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. దీంతో గాలి నాణ్యతలు ‘వెరీ పూరీ’ కేటగిరిలో నమోదైనట్లు సిపిసిబి పేర్కొంది.
కాగా ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యతల స్థాయిలు ఇలా ఉన్నాయి. లోధి రోడ్ సమీపంలో 254, ఇందిరిగాంధీ అంతర్జాతీయ విమానశ్రయం వద్ద 298, పూసా వద్ద 281, ఓక్లా ఫేజ్ వద్ద 298 స్థాయిల్లో గాలి నాణ్యతలు నమోదయ్యాయి. అలాగే ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో ఎక్యూఐ నమోదైంది. అశోక్ విహార్ వద్ద 316, ఆనంద్ విహార్ 311, వాజిర్‌పూర్ 331, వివేక్ విహార్ 318, షాదిపూర్ 375 స్థాయిల్లో గాలి నాణ్యతలు నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. ఢిల్లీలో గాలి నాణ్యతలు తీవ్రస్థాయిలో పడిపోవడం వల్ల స్థానికులు శ్వాసకోశ సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. కాలుష్య నివారణ చర్యల్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నా.. ఫలితం నామమాత్రంగానే ఉంటుంది.