Jharkhand : జార్ఖండ్‌ బిజెపికి ‘పరివార్‌’ సెగ

 టిక్కెట్ల కేటాయింపుపై అసమ్మతి
పలువురి రాజీనామా
రాంచీ : వారసత్వ రాజకీయాలకుతాను వ్యతిరేకమంటూ గొప్పలు చెప్పుకునే బిజెపికి జార్ఖండ్‌లో ‘పరివార్‌’ (బంధుప్రీతి) సెగ తగులుతోంది. పార్టీ టిక్కెట్ల కేటాయింపులో నేతల బంధువులకుపెద్దపీట వేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల కుటుంబ సభ్యులకుటిక్కెట్లు దక్కడంపై పలువురు నేతలు మండిపడుతున్నారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి, లోక్‌సభ ఎనిుకలలో పోటీ చేసి ఓడిపోయిన వారికి బిజెపి టిక్కెట్లు ఇవ్వడం వారికి రుచించడం లేదు. దీంతో ఇప్పటికే కొందరు నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.

ఫిరాయింపుదారులకు పెద్దపీట
జెఎంఎం వ్యవస్థాపకుడు శిబు సొరేన్‌ కోడలు సీతా సొరేన్‌ లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరారు. జంతారా లోక్‌సభ స్థానం నుండి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. మాజీ ముఖ్యమంత్రి మధుకోడా భార్య గీతా కోడా, సమీర్‌ ఓరాన్‌ లోక్‌సభ ఎన్నికలలో ఓటమి చవిచూసినా వారికి శాసనసభ ఎనిుకలలో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి చంపరు సొరేన్‌ సన్నిహితుడైన లోబిన్‌ హేమ్‌బ్రమ్‌ జెఎంఎంకు రాజీనామా చేసి బిజెపిలో చేరితే ఆయనకు కూడా టిక్కెట్‌ దక్కింది. ఎన్‌సిపి మాజీ నాయకుడు కమలేష్‌ సింగ్‌, కాంగ్రెస్‌ మాజీ నేతలు మంజు దేవి, సనీు టప్పో కూడా బిజెపి టిక్కెట్లు పొందారు.

రాజీనామాల పర్వం
ఈ పరిణామాలపై బిజెపిలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం చెలరేగుతున్నాయి. 2014 శాసనసభ ఎనిుకలలో ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ను ఓడించిన బిజెపి నాయకుడు లోయుస్‌ మరాండీ పార్టీకి రాజీనామా చేసి జెఎంఎంలో చేరారు. చంపయి సొరేన్‌, ఆయన కుమారుడు… వీరిద్దరికీ ఎందుకు టిక్కెట్లు ఇవ్వాలని పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యుడు సందీప్‌ వర్మ ప్రశిుంచారు. శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన సూచన ప్రాయంగా చెప్పారు. బిజెపికే చెందిన లక్ష్మణ్‌ తుడు, బస్కో బెస్రా, గణేష్‌ మహాలీ, కునాల్‌ సారంగి వంటి నాయకులు పార్టీనివీడి జెఎంఎం తీర్థం పుచ్చుకునాురు.

మాజీ సిఎం రఘుబర్‌ దాస్‌ కోడలు పూర్ణిమా దాస్‌ సాహు, మాజీ సిఎం అర్జున్‌ ముండా భార్య మీరా ముండా, చంపాయి సోరెన్‌ కుమారుడు బబుల్‌ సోరెన్‌, ఎజెఎస్‌యు ఎంపి సిపి.చౌదరి రోషన్‌ లాల్‌, బిజెపి ఎంపి దౌల్లు మహతో సోదరుడు శత్రుఘ్న మహతోకు టిక్కెట్లు దక్కాయని బిజెపి నేత ఒకరు తెలిపారు. లోక్‌సభ ఎన్నికలో ఓటమి పాలైన సీతా సోరెన్‌, గీతాకోరాలకు టిక్కెట్లు దక్కాయని, ఎస్‌టికి చెందిన మరాండి గిరిజనేతర స్థానంలో పోటీ చేస్తున్నారని అన్నారు.

జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాలకు గాను బిజెపి 66 స్థానాల్లో పోటీ చేస్తుండగా, మిత్రపక్షాలైన ఎజెఎస్‌యు 10, జెడియు 2, లోక్‌జనశక్తి పార్టీ (రామ్‌ విలాస్‌) ఒక స్థానంలో పోటీ చేయనున్నట్లు ఎన్‌డిఎ పకటించింది.

➡️