జమ్మూకాశ్మీర్‌ ప్రజాస్వామ్య వేడుకకు 15 దేశాల దౌత్యవేత్తలు

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లో దాదాపు పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి అసెంబ్లీ ఎన్నికలను తిలకించడానికి ఏకంగా 15 దేశాల దౌత్యవేత్తలు బుధవారం జమ్మూకాశ్మీర్‌కు తరలివచ్చారు. అమెరికా, నార్వే, ఫిలిప్పీన్స్‌, అల్జీరియా, స్పెయిన్‌, సౌత్‌ ఆఫ్రియా దేశాలతోపాటు మరికొన్ని దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కూడా ఉన్నారు. ప్రత్యేక హోదా కోల్పోయిన ఆ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా… ఇబ్బందులు, కష్టాలు పడుతున్నారు. 370 ఆర్టికల్‌ రద్దు తర్వాత దాదాపు జమ్ముకాశ్మీర్‌ మొత్తం అనేక నిర్బంధాలను ఎదుర్కొంది. యావత్‌ ప్రపంచం దీనిపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను పరిశీలించేందుకు, ప్రజాస్వామ్య వేడుకలో ప్రజలు ఏ విధంగా పాల్గంటున్నారో తెలుసుకునేందుకు దౌత్యవేత్తలు జమ్మూకాశ్మీర్‌కు తరలివచ్చినట్లు అధికారికవర్గాలు తెలిపాయి.

➡️