హిందూత్వ ఎజెండాను పునరుద్ఘాటించిన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్
ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపక దినమైన అక్టోబరు 12, విజయదశమి రోజున ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్ ప్రసంగించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి దిగజారిన తర్వాత ఆయన చేసిన మరో ముఖ్యమైన ప్రసంగం నేపథ్యంలో ఇది జరిగింది. ఆ ప్రసంగంలో ఆయన నరేంద్ర మోడీనిలక్ష్యంగా చేసుకున్నారు. తాను మానవ మాత్రుడిు కాదని, దేవుడు తనను పంపాడని మోడీ చెప్పుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బిజెపి 303 సీట్ల నుండి 240 సీట్లకుపడిపోయిన నేపథ్యంలో భగవత్ మాట్లాడుతూ, ‘ఒక వ్యక్తి సూపర్‌మ్యాన్‌గా వుండాలనికోరుకుంటాడు. ఆ తర్వాత దేవ దూత కావాలని, అటుపై భగవాన్ కావాలనికోరుకుంటాడు.’ అని వ్యాఖ్యానించారు. గతంలో అంత సామర్ధ్యం లేనందున తాము ఆర్‌ఎస్‌ఎస్ సాయం కోరామని, కానీ ఇప్పుడు మరింత సామర్ధ్యానిు సముపార్జించుకున్నామని బిజెపి పేర్కొన్న మొదటి ఎన్నికలు కూడా ఇవే కావచ్చు.
భగవత్ ఈ ప్రసంగంతో నరేంద్ర మోడీ తలకెక్కిన అహంకారాన్ని కింద కుదించారు. సంఘపరివార్‌గా పిలిచే ఆర్‌ఎస్‌ఎస్ కూటమి హర్యానా ఎన్నికల్లో అతిచురుగ్గా పనిచేసింది. దానికి తోడు ఎన్నికల కమిషన్ మ్యానిపులేషన్ సాయంతో బిజెపి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందనే భావనను పక్కకునెట్టి మరీ బిజెపి ఈ విజయాన్ని మూటగట్టుకుంది.
తాజాగా దసరా ప్రసంగంలో ఆయన బిజెపి విధానాలనే చాలా వరకు ఏకరువు పెట్టారు. బిజెపియేతర ప్రభుత్వాలు వున్న రాష్ట్రాల్లో ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యాలను, కీలకమైన హిందూత్వ రాజకీయాలను ఎలా తీసుకెళ్లాలో చెప్పారు. ‘డీప్ స్టేట్’, ‘వోకిజమ్’, ‘కల్చరల్ మార్క్సిస్ట్’ వంటి పదాలు అన్ని సాంస్కృతిక సంప్రదాయాలకుశ త్రువులు” అని వ్యాఖ్యానించారు. ఇందుకువారు అనుసరించే పద్ధతి ముందుగా విద్యా సంస్థలను తమ ప్రభావం కిందకు తీసుకోవాలనుకుంటుంది. ఆ తర్వాత ఆలోచనలను, విలువలను, సమాజ విశ్వాసాలను నాశనం చేయడానికి వారు ప్రయతిుస్తారు. అటుపై సమస్యలను కృత్రిమంగా సృష్టించి, ప్రజల్లో తాము బాధితులమనే భావనను పాదుకొల్పడానికి ప్రయతిుస్తారు. ఆ తర్వాత, అసమ్మతినిరెచ్చగొడతారు, ప్రజలు దూకుడుగా వ్యవహరించేలా చేస్తారు. ఒక అరాచక వాతావరణాన్ని సృష్టిస్తారు, వ్యవస్థ పట్ల చట్టాలు, పాలన పట్ల ప్రజల్లో విద్వేషం నెలకొనేలా చేస్తారు. ఇవనీు చేసిన తర్వాత దేశంపై ఒకరి ఆధిపత్యం లేదా పెత్తనం చెలాయించడమన్నది చాలా సులభతరమై పోతుంది.”
సామాజిక, రాజకీయ అన్యాయాలను సహించలేని ప్రజల వ్రవర్తన, వారి వైఖరులను ఉద్దేశిస్తూ, పెద్దగా ప్రాచుర్యంలో లేని పదం వోకిజం (మేల్కోలుపు)ను అత్యంత అవమానకరమైన రీతిలో మితవాదులు ఉపయోగించారు. ఆయన చేసిన ప్రసంగంలో ఇదే కీలకమైన వాక్యం. సామాజిక రాజకీయ వర్గాల్లో హిందూ మితవాదం ఆధిపత్యం చెలాయించేంత ఆర్‌ఎస్‌ఎస్ కూటమే ఈ పద్ధతిని అమలు చేస్తోంది. తన శాఖల ద్వారా అంటే సరస్వతి శిశుమందిర్, ఏకలవ్య విద్యాలయాలు వంటి పాఠశాలల ద్వారా, అలాగే తనకును విస్తృత నెట్‌వర్క్ ద్వారా, నోటి ప్రచారం ద్వారా దీనిని ముందుకు తీసుకెళ్తుంది. అలాగే కుల, లింగ వివక్ష వ్యవస్థను పెంచుతును సామాజిక ఇంగితజ్ఞానానిు (సోషల్ కామన్‌సెన్స్) తనకును విస్తృత నెట్‌వర్కు ద్వారా ఇది ప్రభావితం చేస్తోంది. ఇక చివరగా బిజెపి సానుభూతి గల కార్పొరేట్, ఐటి విభాగాలు మీడియాను నియంత్రించడం ద్వారా సమాజంలోని పెద్ద వర్గం ఆలోచనా ధోరణిని హిందూ జాతీయవాద కార్యాచరణ రూపుదిద్దుతోంది.
ఇప్పుడు వోకిజం (మేల్కోలుపు) ఏం చేస్తుంది? న్యాయమైన సమాజం కోసం ఇది ఆకాంక్షిస్తుంది, పోరాడుతోంది. కులం, మతం, రంగు, భాషల ప్రాతిపదికగా వివక్షను ప్రదర్శించడానిు ఇది వ్యతిరేకిస్తుంది. ఎల్‌జిబిటి హక్కులకు మద్దతిస్తుంది. అనిు జీవుల సమానత్వపు హక్కులను హిందూ జాతీయవాద రాజకీయాల్లో చాలా కీలకమైన బ్రాహ్మణవాదం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీనేు మరికొద్దిగా స్పష్టంగా, సూటిగా చెప్పాలంటే పలు రకాల రాజకీయ ధోరణులకుమతం ముసుగు వేస్తారు. తాలిబన్, ముస్లిం బ్రదర్‌హుడ్, అలాగే శ్రీలంక, మయన్మార్‌ల్లో బౌద్ధమతం పేరుతో రాజకీయాలు, అసమానతలను పెంచి పోషిస్తును క్రైస్తవ ఛాందసవాదం ఇవనీు ఆ కోవలోకే వస్తాయి. స్థానిక పరిస్థితులపై ఆధారపడి వారు భిన్న వ్యక్తీకరణలకు పాల్పడుతుంటారు.
మరో రకంగా చూసినట్లైతే, హిందూ జాతీయవాద సిద్ధాంత వ్యవస్థాపకులు, దళితులను, మహిళలను కించపరుస్తున్న మనుస్మృతిని ప్రశంసించారు. ముస్లింలు, క్రైస్తవులను కూడా ఆర్‌ఎస్‌ఎస్ విదేశీయులుగానే పరిగణిస్తోంది. 1984లో సిక్కుల ఊచకోతకు రహస్యంగా మద్దతిచ్చింది. ఒక సమాజంలో సామాజిక ఉద్యమాల లక్ష్యమైన సమానత్వపు విలువలను ముందుకు తీసుకెళ్ళడానికి చూస్తునుందున వోకిజాన్ని ఒక దుష్ట శక్తిగా, రుగ్మతగా మితవాద రాజకీయాలు భావిస్తున్నాయి. అణచివేతకుగురైన వర్గాలు చేసే చాలా ఉద్యమాల బలమైన కోరికే ప్రజాస్వామ్యం, దీనికోసమే ఇదంతా. భారతదేశంలో దళితులు, మహిళలు, ఎల్‌జిబిటి చేపట్టే ఉద్యమాలను హిందూ జాతీయవాదులు తక్కువ చేసి చూస్తున్నారు. ఛాందసవాద శక్తులు పాలన సాగించే ముస్లిం మెజారిటీ దేశాల్లో మహిళలు ప్రధాన లక్ష్యాలుగా మారుతునాురు. సమానత్వపు విలువల స్థానే అసమాన విలువలతో కూడిన ప్రాచీన స్వర్ణయుగపు విలువలను ప్రవేశపెట్టాలనుది ఆర్‌ఎస్‌ఎస్ కూటమి ప్రయతుంగా వుంది. అణగారిన వర్గాల హక్కులను పెంపొందించే ఆలోచనలు, ఉద్యమాల కోసం ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్తలు ఈ వోకిజం పదానిు ఉపయోగిస్తున్నారు.
ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిల మధ్య అంతర్గత ఘర్షణలు వారికే సంబంధించిన ప్రైవేటు అంశం కాగా, వాటి మధ్య ఇగో ఘర్షణలు వునుప్పటికీ ఈ రెండు సంస్థల మౌలిక విలువలు ఒక్కటే. ఇతర విషయాలు చాలా వాటిల్లో బిజెపి ఏం చెబుతోందో భగవత్ కూడా అదే చెబుతారు. ”ఈ కారణంగా నేడు, దేశంలోనివాయవ్య సరిహద్దుల్లోనిపంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లు, సముద్ర హద్దులు కలిగిన కేరళ, తమిళనాడులు, బీహార్ నుండి మణిపూర్ వరకుమొత్తంగా పూర్వాంచల్ కల్లోలమయ్యాయి.” అంటూ బిజెపియేతర పాలిత రాష్ట్రాలను ఆయన విమర్శించారు. లడఖ్‌ను, మణిపూర్‌ను ఒక గాటన కట్టడం ద్వారా వారి అసలు రంగు కూడా బయటపడింది.
మణిపూర్‌లో కుకీలకు వ్యతిరేకంగా మరీ ముఖ్యంగా మహిళలపై అత్యంత హేయమైన రీతిలో హింస చోటు చేసుకుంది. ఈ విషయంలో బిజెపి ప్రభుత్వ ఉదాసీనత మరింత ఆందోళన కలిగిస్తోంది. లడఖ్‌కు సంబంధించినంత వరకు పర్యావరణాన్ని పరిరక్షించేందుకై, సమాన పౌరసత్వం కోసం అనేక ఉద్యమాలను మనం చూశాం. పోరాటాలు చేయాల్సినంత తీవ్రమైన అంశాలే అవి. ఎంత శాంతియుతమైన పోరాటం అది? గుర్తించదగినటువంటి సోనమ్ వాంగ్‌చుక్ నాయకత్వం గురించి స్వర్ణాక్షరాలతో రాయవచ్చు. అలాగే ఆర్‌ఎస్‌ఎస్ నుండి ఉద్భవించిన బిజెపి మొత్తంగా ఈ లడఖ్ ఉద్యమానిు ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో కనిపిస్తోంది. ఇది భారతదేశ సమకాలీన చరిత్రలో ఒక చీకటి అధ్యాయం.
ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ విషాద ఘటన గురించి ప్రస్తావించడం, మరోవైపు మహిళా రెజ్లర్లపై జరిగిన అత్యాచారాలు దళిత బాలికలపై పెరుగుతును అత్యాచారాల పట్ల మౌనం పాటించడం చూస్తుంటే ఆయన పక్షపాతం అర్ధమవుతోంది. అత్యాచారమనేది ఇండియా (పట్టణ) ప్రాంతాల్లో జరుగుతుంది తప్ప భారత్ (గ్రామాల్లో)లో జరగదనిఈ మహానుభావుడు ఒకసారి వ్యాఖ్యానించారు. కానీ ఇటువంటి కేసుల్లో చాలా శాతం బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే చోటు చేసుకుంటున్నాయి, అవి కూడా గ్రామాల్లోనో లేదా చిన్న పట్టణాల్లోనో జరుగుతున్నాయి. ఇలాంటి కేసులు అంటే దళితులపై అత్యాచారాలు 2022లో ఉత్తరప్రదేశ్‌లో 12,287 చోటు చేసుకోగా, ఆ తర్వాత స్థానంలో రాజస్థాన్ (8,651), మధ్యప్రదేశ్ (7,732) నమోదవుతున్నాయని, సామాజిక న్యాయం, మహిళా సాధికారత మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఇది ఆందోళనకరమైన పరిణామం.
బలహీనులుగా వుంటే తమనితాము రక్షించుకోలేరని అందువల్ల ఐక్యంగా, బలంగా వుండాలంటూ హిందువులను భగవత్ కోరడం ఆయన ప్రసంగంలో అత్యంత ముఖ్యమైన అంశంగా వుంది. భారతీయులుగా మనందరం సమైక్యంగా వుండనక్కరలేదా? భారత రాజ్యాంగం ప్రకారం భారతీయులుగా సమైక్యతతో వుండడంలో ఏదైనా సమస్య వుందా? భగవత్ వైపు నుండి మరో రకంగా ఆలోచించినట్లైతే ఇది కూడా కుతర్కమే అవుతుంది. ఎందుకంటే భారత రాజ్యాంగం పట్ల వారి విశ్వాసం కూడా ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే వుంటుంది.
– రామ్ పునియాని