Maharashtra :మహారాష్ట్ర ఆపద్ధర్మ సిఎంగా షిండే

ముంబయి : మహారాష్ట్రలో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. సిఎం ఏక్‌నాథ్‌ షిండే మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సిపి రాధాకృష్ణన్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గా కొనసాగాలని ఆయన షిండేను కోరారు. ఉప ముఖ్యమంత్రులు అజిత్‌ పవార్‌, దేవేంద్ర ఫడ్నవీస్‌ షిండే వెంట రాజ్‌భవన్‌కు వెళ్లారు. మహాయుతి కూటమిగా కలిసే పోటీ చేశామని, ఇప్పటికీ కలిసే ఉన్నామని షిండే ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు బిజెపి కేంద్ర నాయకత్వం గ్రీన్‌సిగల్‌ ఇచ్చిందని, ఆయననే సిఎంను చేయాలని బిజెపి ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నా రు. ఫడ్నవీస్‌కు సిఎం పదవి ఇచ్చే విషయంపై తమ పార్టీతో ఎవరూ సంప్రదింపులు జరపలేదని, ఇప్పటివరకూ తాము ఎవరి పేరుకూ అంగీకారం తెలుపలేదని శివసేన నాయకులు చెప్పారు. తనకు మద్దతుగా ఎవరూ ముంబయికి రావద్దని షిండే తన పార్టీ కార్యకర్తలను కోరారు. బిజెపి నాయకత్వం కేంద్ర పరిశీలకుడిని నియమించి, ముంబయికి పంపిన తర్వాతే ముఖ్యమంత్రి పదవిపై పీఠముడి వీడుతుందని భావిస్తున్నారు.

➡️