జోధ్‌పూర్ : ” చెత్త సేకరణకు గాడిదలు కావాలి … టెండర్లకు రండి ” అని జోథాపూర్ కార్పొరేషన్ పిలుపునిచ్చింది. సహజంగా చెత్త వ్యాన్లు వచ్చి చెత్తను సేకరిస్తుంటాయి. కానీ జోధ్‌పూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెత్తను సేకరించడానికి చెత్త బండ్లకు బదులు కాలువ కార్పొరేషన్లు గాడిదలను వాడుతున్నాయి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లోకి వాహనాలు వెళ్లవు. జోధ్‌పూర్‌లోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా బ్రహ్మపురి, ఖగల్ వంటి ప్రాంతాల్లో, కార్పొరేషన్ చెత్త వాహనాలు వెళ్లవు. నేటికీ అలాంటి ప్రాంతాల్లో చెత్తను సేకరించడానికి గాడిదలను ఉపయోగిస్తున్నారు. దీని కోసం సాధారణ టెండర్‌ను పిలిచారు. ప్రతి సంవత్సరం గాడిదల కోసం కార్పొరేషన్ రూ.60 లక్షల విలువైన టెండర్‌ను వేస్తుంది. ఇక్కడి ఎమ్మెల్యే కూడా గాడిదలను పెంచడానికి కసరత్తు ప్రారంభించారు. నగరంలో గాడిదల సంఖ్యను పెంచాలని జోధ్‌పూర్ ఎమ్మెల్యే మున్సిపల్ కార్పొరేషన్‌ను డిమాండ్ చేశారు. జోధ్‌పూర్‌లోని చాలా వార్డులలో ఇప్పటికీ గాడిదలను పరిసరాలను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ ప్రదేశాల్లో చెత్తను గాడిదలపై డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ప్రస్తుతం జోధ్‌పూర్‌లో 65 గాడిదలు క్లీనింగ్‌లో ఉన్నాయి. ఈ ప్రదేశాల్లో దాదాపు 200 గాడిదల అవసరం ఉంది. ప్రస్తుతం ఇక్కడ రూ.65 లక్షల టెండర్ కింద 65 గాడిదలను అమర్చారు. అంటే ఒక్క గాడిదపై లక్ష ఖర్చు చేశారన్నమాట.!
