- చట్ట పరిధిలో పని చేయాలి
- ఇడికి బాంబే హైకోర్టు ఆదేశాలు
ముంబయి : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వంటిి కేంద్ర ఏజెన్సీలు పౌరులను వేధించటం ఆపాలని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. చట్టపరిధిలో పని చేయాలని ఆదేశించింది. తగిన ఆధారాలు లేకుండా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిపై మనీలాండరింగ్ దర్యాప్తును ఇడి ప్రారంభించటాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. ఇందుకు ఇడికి రూ.1 లక్ష పెనాల్టీని విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్ మిలింద్ జాధవ్ ఆదేశాలు జారీ చేశారు. ”ఇడి వంటి చట్టాన్ని అమలుపర్చే ఏజెన్సీలకు ఒక బలమైన సందేశాన్ని పంపటం కోసమే ఈ అసాధారణ ఖర్చులు(పెనాల్టీ) విధించాల్సి వచ్చింది. సదరు ఏజెన్సీలు చట్టం పరిమితులకు అనుగుణంగా వ్యవహరించాలి. చట్టాన్ని వాటి చేతుల్లోకి తీసుకోవద్దు. పౌరులను వేదించ్చొద్దు” అని జస్టిస్ మిలింద్ జాదవ్ అన్నారు. అయితే, ఇడి అప్పీలు కోసం ఈ కేసులో హైకోర్టు తన తీర్పును నాలుగు వారాలపాటు నిలుపుదల చేసింది.