మేఘాలయలో భూకంపం

Jun 10,2024 12:18 #Meghalaya

మేఘాలయ : మేఘాలయలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.3గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ (ఎన్‌సిఎస్‌) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సోమవారం తెల్లవారుజామున 2.23 గంటల సమయంలో పశ్చిమ కాసి హిల్స్‌ జిల్లాలో భూకంపం సంభవించింది. వెడల్పు : 25.60, పొడవు : 91.31, ఐదు కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు ఎస్‌సిఎస్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేసింది.

➡️