న్యూఢిల్లీ : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ) ఈడి దాడికి దిగింది. సిద్ధరామయ్య, ఇతరులకు చెందిన దాదాపు రూ.300 కోట్ల విలువైన 140 యూనిట్లకు పైగా స్థిరాస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడి తెలిపింది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపుల్లో జరిగిన అవతవకలపై మనీలాండరింగ్ విచారణలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి ఈడి దాడికి దిగడం గమనార్హం. స్వాధీనం చేసుకున్న ఆస్తులను రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లుగా పనిచేస్తున్న వివధ వ్యక్తుల పేరిట రిజిస్టర్ అయినట్లు ఈడి ఓ ప్రకటనలో తెలిపింది.
