సమీర్‌ వాంఖడేపై ఈడీ కేసు

Feb 11,2024 12:03 #ED, #Sameer Wankhade

ముంబయి: సినీనటుడు షారుక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ను డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా చేర్చకుండా ఉండేందుకు రూ.25 కోట్లు లంచం అడిగారన్న ఆరోపణలపై ఎన్‌సీబీ ముంబయి మాజీ జోనల్‌ డైరెక్టరు సమీర్‌ వాంఖడేపై ఈడీ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. సమీర్‌పై ఇప్పటికే సీబీఐ కేసు నమోదయిన విషయం తెలిసిందే. 2021లో డ్రగ్స్‌కేసులో ఆర్యన్‌ఖాన్‌ను సమీర్‌ అరెస్టు చేశారు. ఈ కేసులో ఆర్యన్‌కు ఎన్‌సీబీ క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఆ తర్వాత సమీర్‌పై పలు ఆరోపణలు రావడంతో జోనల్‌ డైరెక్టరు పదవి నుంచి బదిలీ చేసి, విచారణ చేపట్టారు.

➡️