ఢిల్లీ వక్ఫ్‌ బోర్డ్‌ కేసులో ఆప్‌ ఎమ్మెల్యేపై ఇడి చార్జిషీట్‌

న్యూఢిల్లీ :   ఢిల్లీ వక్ఫ్‌ బోర్డ్‌ అక్రమాల కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఆప్‌ ఎమ్మెల్యే అమాతుల్లా ఖాన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) మంగళవారం చార్జిషీటు నమోదు చేసింది. 110 పేజీల సప్లిమెంటరీ చార్జిషీటులో మరో నేత మరియం సిద్ధిఖీ పేరును కూడా చేర్చింది. వచ్చే నెల 4వ తేదీన కోర్టు ఈ చార్జిషీటును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

గత నెల 2న అమాతుల్లాఖాన్‌ను ఓక్లా నివాసం నుండి అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

ఆప్‌ నేత బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ప్రత్యేక జడ్జి విశాల్‌ గోగె నవంబర్‌ 7వ తేదీకి వాయిదా వేశారు.

➡️