టిఎంసి నేతల నివాసాలపై ఈడి దాడులు

 కోల్‌కతా :   తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) నేతల నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) దాడులు నిర్వహించింది.  ఫైర్‌ అండ్‌ ఎమర్జెన్సీ సర్వీసెస్‌ మంత్రి సుజిత్‌ బోస్‌, ఎమ్మెల్యే తపస్‌ రాయ్, నార్త్‌ డండం మునిసిపాలిటీ మాజీ చైర్మన్‌ సుబోధ్‌ చక్రవర్తి నివాసాలపై దాడులు చేపట్టింది.  శుక్రవారం తెల్లవారుజామున నార్త్‌ 24 పరగణాల జిల్లాలోని లేక్‌ టౌన్‌ ప్రాంతంలోని బోస్‌కు చెందిన రెండు నివాసాలు, గంగూలీ స్ట్రీట్‌లోని తపస్‌రాయ్  నివాసం, సుబోధ్‌ చక్రవర్తి నివాసంలో తనిఖీలు చేపడుతున్నట్లు ఈడి అధికారులు తెలిపారు. వారి నివాసాల వద్ద భారీగా కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు. పౌర సంస్థల నియామకాలలో జరిగిన అవతకలపె  విచారణ చేపడుతోంది.

➡️