హైదరాబాద్: హైదరాబాదులో రెండు సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ చైర్మన్, ఘరానా గ్రూప్ చైర్మన్ ఎండి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఈ కంపెనీలకు సంబంధించిన నాలుగు ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిపింది. సికింద్రాబాద్, బోయి న్ పల్లి, జూబ్లీహిల్స్ , మాదాపూర్ ప్రాంతాలలో సోదాలు జరిపారు. సాయి సూర్య డెవలపర్స్ సురానాకి అనుబంధంగా పనిచేస్తున్న కంపెనీ. ఇటీవల ప్రముఖ బ్యాంకు నుంచి వేలకోట్ల రూపాయలు రుణం తీసుకున్న సురానా కంపెనీపై రుణాలను తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టిందని కేసు నమోదు చేశారు.