2న కేజ్రీవాల్‌ను కస్టడీకి అప్పగించండి : ప్రత్యేక కోర్టులో ఇడి పిటీషన్‌

న్యూఢిల్లీ : మధ్యంతర బెయిల్‌ ముగిసిన తరువాత అంటే జూన్‌ 2న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను తమకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగించాలని ప్రత్యేక కోర్టులో ఇడి సోమవారం పిటీషన్‌ వేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ప్రస్తుతం కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ బెయిల్‌ గడువు జూన్‌ 1 వరకూ ఉంది. జూన్‌ 2న కేజ్రీవాల్‌ మళ్లీ కోర్టులో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్‌తోపాటు, సహ నిందితురాలు, బిఆర్‌ఎస్‌ నాయకురాలు కె.కవితపై విచారణ జరిపేందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని సోమవారం న్యాయమూర్తి కావేరి బవేజాకు ఇడి తెలిపింది. మంగళవారం తదుపరి వాదనలను జడ్జి విననున్నారు.

➡️