ED Raids: ఈడీ బృందంపై దాడి

ఢిల్లీ: సైబర్ ఫ్రాడ్-లింక్డ్ మనీ లాండరింగ్ కేసులో గురువారం సోదాలు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందంపై నిందితులు దాడికి పాల్పడ్డారని  అధికారులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై ఫెడరల్ ఏజెన్సీ పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. పిపిపివైఎల్ సైబర్ యాప్ మోసానికి సంబంధించిన కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా ఈడీ సోదాలు చేపట్టింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అశోక్ శర్మ, అతని సోదరుడు సహా నిందితులు ఈడీ బృందంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఈడీ బృందంలో ఒక అదనపు డైరెక్టర్ గాయపడ్డారని మీడియా వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఈడీ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. అగ్రశ్రేణి చార్టర్డ్ అకౌంటెంట్‌లను లక్ష్యంగా చేసుకుని భారతదేశం అంతటా పనిచేస్తున్న భారీ సైబర్‌క్రైమ్ నెట్‌వర్క్‌తో ముడిపడి ఉన్న వారిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ యొక్క హై-ఇంటెన్సిటీ యూనిట్ ఈ రోజు విస్తృతమైన సోదాలు ప్రారంభించిందని పేర్కొంది. ఫిషింగ్ స్కామ్‌లు, క్యూఆర్ కోడ్ మోసం, పార్ట్ టైమ్ జాబ్ స్కామ్‌లతో సహా వేలాది సైబర్ క్రైమ్‌ల నుండి వచ్చిన అక్రమ నిధుల లాండరింగ్‌ను వెలికితీసేందుకు ఈ దర్యాప్తును సాగిందని వెల్లడించింది.

➡️