కర్ణాటక సిఎం సిద్ధరామయ్యపై ఇడి కేసు

బెంగళూరు : మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా)కి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మరికొందరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) సోమవారం కేసు నమోదు చేసింది. సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజు తదితరులపై మైసూరులోని లోకాయుక్త పోలీసు సంస్థ సెప్టెంబర్‌ 27న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. సిద్ధ రామయ్య తన భార్యకు 14 స్థలాల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డార నే ఆరోపణలపై విచారణ జరిపేందుకు గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ మంజూరు చేసిన అనుమతిని హైకోర్టు సమర్థించిన మరుసటి రోజు బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఈ ఆదేశాలు జారీ చేశారు. నిందితులను విచారణకు పిలిచేందుకు, వారి ఆస్తులను అటాచ్‌ చేయడానికి ఇడికి అధికారం ఉంది. ప్రతిపక్షాలు తనను చూసి ”భయపడుతున్నా యని”, ఇది తనపై మొదటి ”రాజకీయ కేసు” అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, న్యాయపరంగా పోరాడతానని ఆయన తెలిపారు.

➡️